పటమట(విజయవాడతూర్పు): దుర్గా ఘాట్‌లో డిసెంబర్ ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు జరిగే ‘కృష్ణవేణి సంగీత నీరాజనం’ మ్యూజిక్ ఫెస్టివల్‌కు పక్కా ఏర్పాట్లు చేయాలని మునిసిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం దుర్గా ఘాట్‌లో మ్యూజిక్ ఫెస్టివల్ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. దేవదాయ, టూరిజం అధికారుతో వీఎంసీ అధికారులు సమన్వయం చేసు కోవాలన్నారు. జోనల్ కమిషనర్–1 రమ్య కీర్తన, ఇన్చార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment