నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ మొగల్రాజపురానికి చెందిన పసుమల్లి శ్రావణి, ఓం ప్రకాష్ కుటుంబం మంగళవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ. 1,00,116 విరాళాన్ని అందజేసింది. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ సిబ్బంది దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
ఉర్దూ పాఠశాల తనిఖీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవానీపురంలోని ఉర్దూ పాఠశాలను మంగళవారం నేషనల్ మైనార్టీ కమిషన్ సభ్యుడు సయ్యద్ షహజాది ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు. పాఠ శాలలను తనిఖీ చేసిన వారిలో సర్వే కమిషనర్ ఆఫ్ వక్ఫ్ షేక్ షేరీన్ బేగం, ఉమ్మడి కృష్ణా జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ రబ్బాని, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.
అంబాసిడర్లుగా
స్ఫూర్తి నింపాలి
గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (సౌర విద్యుత్) పథకం అమలుకు అంబాసిడర్లుగా ప్రజల్లో స్ఫూర్తి నింపి, లబ్ధిదారులుగా రిజిస్ట్రేషన్ చేసుకొనేలా ప్రోత్సహించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సచివాలయ కార్యదర్శులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. తొలుత ఏపీసీపీడీసీఎల్ అధికారులు కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలు, ప్రయోజనాలను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు తొలుత పథకం కింద లబ్ధి పొందేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అనంతరం తమ పరిధిలోని ప్రజలకు పథకంపై అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఎ.మురళీమోహన్, నోడల్ అధికారి ఎం.భాస్కర్ పాల్గొన్నారు.
చెక్ పోస్ట్ వద్ద
నిఘా పెంచాలి
జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని తొర్రగుంటపాలెంలో ఉన్న ఎకై ్సజ్ స్టేషన్‌ను, గరికపాడు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను ఎకై ్సజ్ కమిషనర్ నిశాంత్, ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టర్ శర్మతో కలిసి మంగళవారం సందర్శించారు. తెలంగాణ నుంచి అక్రమంగా వచ్చే మద్యాన్ని నియంత్రించడంలో కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు. అలాగే చెక్‌పోస్టు వద్ద నిఘాను పెంచాలని ఎకై ్సజ్ అధికారులకు వారు సూచించారు. మద్యం అమ్మకాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట ఎకై ్సజ్ డీసీ శ్రీనివాస్, ఏఈఎస్ స్థానిక అధికారులు ఉన్నారు.
స్కేటింగ్ పోటీల్లో జంక్షన్ చిన్నారికి స్వర్ణం
హనుమాన్‌జంక్షన్ రూరల్: కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందిన చిన్నారి అన్విత జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. డాక్టర్ పోలవరపు కల్యాణ చక్రధర్, డాక్టర్ స్వరాజ్యం దంపతుల కుమార్తె అన్విత ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరులో ఇన్‌లైన్ హాకీ కేడెట్స్ ఆధ్వర్యంలో జరిగిన 62వ నేషనల్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో సత్తా చాటింది. అండర్–11 కేటగిరీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి బంగారు పతకాన్ని కై వసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment