యువత ఉన్నతంగా ఎదగాలి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): యువత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకు పాటుపడాలని రాష్ట్ర గనులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కృష్ణా తరంగ్ – 2024 అంతర కళాశాలల యువజనోత్సవం మంగళవారం విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ యువజనోత్సవాలను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొల్లు మాట్లాడుతూ యువతలోని ప్రతిభాపాటవాలను వెలికితీసి ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం ఓ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ ఉత్సవాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. ఈ క్రమంలోనే స్కిల్ సెన్సెస్‌కు శ్రీకారం చుట్టిందన్నారు. యువతలోని నైపుణ్యాలు ఏంటనేవి నమోదు చేసి, ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, సుస్థిర ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు తగిన నైపుణ్యాలు పెంపొందించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ (ఇన్‌చార్జ్) ఆచార్య ఆర్. శ్రీనివాసరావు, రెక్టార్ ఆచార్య ఎంవీ బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. శోభన్‌బాబు, కృష్ణా తరంగ్ కన్వీనర్ డాక్టర్ ఎం. కోటేశ్వరరావు, కళాశాల కార్యదర్శి టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు పాశ్చాత్య బృందగానం, శాసీ్త్రయ వోకల్ సోలో, క్విజ్, మెహింది, జానపద బృంద వాద్యం, శాసీ్త్రయ నాట్యం, శాసీ్త్రయ వాద్యం, కార్టినింగ్ అంశాల్లో పోటీలు జరిగాయి.
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభమైన కృష్ణా తరంగ్–2024
Comments
Please login to add a commentAdd a comment