టెక్ ఫెస్ట్‌లతో సృజనాత్మకత
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువతలో ఉన్న ఆలోచనా శక్తిని పెంపొందించేందుకు ఇలాంటి టెక్‌ఫెస్ట్‌లు ఎంతగానో దోహదం చేస్తాయని ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు చెప్పారు. విజయవాడ రమేష్ ఆస్పత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జరుగుతున్న రీజనల్ పాలిటెక్ ఫెస్ట్–2024ను అశోక్‌బాబు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వారు చదువుకున్న అంశాలకు వారిలో ఉన్న తెలివితేటలను జోడించి మంచి ప్రాజెక్టులను రూపొందించారన్నారు. కొత్త ఆవిష్కరణలు చిన్నవిగానే మొదలైన తర్వాతే మల్ట్టీనేషనల్ కంపెనీ స్థాయికి ఎదుగుతాయని చెప్పారు. విద్యార్థిలో ఉన్న ఆలోచనలే వారిలో నైపుణ్యాలను పెంచుతాయన్నారు. రీజనల్ పాలిటెక్ ఫెస్ట్–2024 కన్వీనర్ ఎం.విజయ సారథి మాట్లాడుతూ ఇక్కడ బహుమతులు పొందిన ప్రాజెక్టు నమూనాలు జనవరి 6, 7, 8 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి టెక్‌ఫెస్ట్‌కు ఎంపిక అవుతాయన్నారు.
విజేతలు వీరే..
సాయంత్రం జరిగిన ముగింపు సభకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ (స్పా) కళాశాల డైరెక్టర్ సి.రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు నమూనాలను సందర్శించి వారిని అభినందించారు. రీజనల్ పాలిటెక్ ఫెస్ట్–2024లో మొదటి బహుమతి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన మెకానికల్ విభాగం విద్యార్థులు తయారు చేసిన ప్రొటైపింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఆన్ 3డీ ప్రింటింగ్ ప్రాజెక్టు నమూనాకు వచ్చింది. రెండో బహుమతి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఈసీఈ విభాగం విద్యార్థులు తయారు చేసిన ఆటోమేటెడ్ స్మార్ట్ స్ట్రీట్ లైట్ ఇన్‌టెన్‌సిటీ కంట్రోలర్ ప్రాజెక్టు నమూనాకు లభించింది. మొదటి బహుమతి ఎంపికై న ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థులకు రూ.25వేల చెక్కు, రెండో బహుమతిగా ఎంపికై న ప్రాజెక్టును తయారు చేసిన వారికి రూ.10 వేల చెక్కును అతిథులు అందజేశారు.
ఎమ్మెల్సీ అశోక్‌బాబు, స్పా కళాశాల డైరెక్టర్ రమేష్ ముగిసిన రీజనల్ పాలిటెక్ ఫెస్ట్–2024
Comments
Please login to add a commentAdd a comment