నా మార్గం కమ్యూనిజం
సాక్షి అమరావతి: తాను కమ్యూనిజాన్ని విశ్వసిస్తానని, తన మార్గం కమ్యూనిజమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ ఉద్ఘాటించారు. విశాలాంధ్ర ప్రచురించిన ‘దీపిక’ రచన ద్వారా కేంద్ర అవార్డును అందుకోవడం గర్వకారణమన్నారు. విజయవాడ విశా లాంధ్ర విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో గురువారం చంద్రం బిల్డింగ్స్‌లో లక్ష్మీనారాయణకు సన్మానం చేశారు. 1974 నుంచి అరసంలో కొనసాగుతున్న తనకు విశాలాంధ్రతో కూడా అప్పటి నుంచి అనుబంధం కొనసాగుతోందన్నారు. 150కి పైగా పుస్తకాలకు సంకలనకర్తగా, గౌరవ సంపాదకుడిగా వ్యవహరించానని అన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో మార్పులు రావాలని, కమ్యూనిస్టు ఉద్యమం మరింత బలపడాలని అభిలషించారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, విశాలాంధ్ర దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కూన అజయ్‌బాబు, పి.హరినాథ్‌రెడ్డి, చావా రవి తదితరులు మాట్లాడుతూ పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం గర్వకారణమని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment