మెడికల్ రీసెర్చ్‌లో క్లినికల్ ట్రయల్స్‌కు ప్రాముఖ్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): మెడికల్ రీసెర్చ్‌లో క్లినికల్ ట్రయల్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉందని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి అన్నారు. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(జీఎస్‌ఎంసీ)లో ఇనిస్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ, క్లినికల్ రీసెర్చ్ రివ్యూ కమిటీలను ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం వేడుకలు నిర్వహించారు. నెక్సస్ క్లినికల్ సర్వీసెస్ వారి భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు వైద్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధికారెడ్డి మాట్లాడుతూ క్లినికల్ ట్రయల్స్‌ను సమర్ధంగా నిర్వహించాలన్నారు. ఎథిక్స్ కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ క్లినికల్ రీసెర్చ్‌లో పాటించాల్సిన రోగి హక్కులు, భద్రత, నీతి నియమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మెరుగైన క్లినికల్ రీసెర్చ్ సేవల కోసం జీఎస్‌ఎంసీ, నోవా నార్డిస్క్ ఇండియా సంస్థల మధ్య ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్‌కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, పూర్వ రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్, డాక్టర్ సత్యనారాయణరావు, డాక్టర్ శివశంకర్, డాక్టర్ రాంబాబు, డాక్టర్ రెహ్మాన్, ఎథిక్స్ కమిటీ సభ్యులు, క్లినికల్ రీసెర్చ్ రివ్యూ కమిటీ సభ్యులు, కళాశాలలోని వివిధ వైద్య విభాగాధిపతులు, ముఖ్య పరిశోధకులు, రీసెర్చ్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఎథిక్స్ కమిటీ మెంబర్ సెక్రటరీ డాక్టర్ ఎం.రజని, రీసెర్చ్ అడ్మిన్ కె.యుగంధర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్
డాక్టర్ రాధికారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment