రాబోయే తరానికి క్రీడా యాప్ దిక్సూచి
విజయవాడస్పోర్ట్స్: క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందించే దిశగా రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు చేపడుతున్నామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. క్రీడా యాప్, క్రీడా పాలసీని విజయవాడలోని ఓ హోటల్లో మంత్రి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా సంఘాలకు, క్రీడాకారులకు, క్రీడా పోటీల సమాచారానికి సంబంఽధించిన సమగ్ర సమాచారాన్ని అందించే దిశగా యాప్‌ను రూపొందించామన్నారు. క్రీడా శాఖలో పారదర్శకత కోసమే ఈ యాప్‌ను క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. నకిలీ క్రీడా సర్టిఫికెట్లను నిలువరించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని అభిప్రాయ పడ్డారు. కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, క్రీడా శాఖ కార్యదర్శి వినయ్ చంద్, శాప్ ఎండీ గిరీషా, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ, కరాటే క్రీడాకారిణి పూజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment