విద్యార్థులు నైతిక విలువలు అలవర్చుకోవాలి
రామవరప్పాడు: విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే నైతిక విలువలు అలవర్చుకోవాలని రాష్ట్ర హోం శాఖమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో శనివారం పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఓపిక, విశ్వాసం, నమ్మకమనే మూడు లక్షణాలను ప్రతి విద్యార్థి అలవరుచుకున్నప్పుడే భవిష్యత్‌లో విజయాలు సాధించగలరన్నారు. ముఖ్య అతిథి మిషన్ డైరెక్టర్, మెప్మా నంబూరి తేజ్ భరత్ మాట్లాడుతూ లక్ష్యాలను నిర్ధేశించుకుని ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు. అనంతరం పాఠశాలలో 10, 12వ తరగతుల్లో ప్రథమ స్థానాన్ని సాధించిన విద్యార్థులకు హోంమంత్రి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో సీబీఎస్‌ఈ రీజనల్ ఆఫీసర్ సువేందు శేఖర్ దాస్, పాఠశాల ప్రిన్సిపాల్ భువనేశ్వరన్, ప్రొవైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, పి.సునంద, డైరెక్టర్ పరిమి పవన్‌చంద్, కడియాల ప్రవీణ్‌కుమార్, అకడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment