ఈవీఎం గోదాము పరిశీలన
చిలకలపూడి(మచిలీపట్నం): ఈవీఎం గోదాముల వద్ద 24 గంటలూ పూర్తిస్థాయి బందో బస్తు నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. ఆయన కృష్ణా జిల్లా కలెక్టరేట్ లోని ఈవీఎం గోదామును శనివారం పరిశీలించారు. సీసీ కెమెరాలు, సర్వైలెన్స్ రూమ్‌ను తనిఖీ చేశారు. అక్కడి రిజిస్టర్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, కలెక్టర్ డి.కె.బాలాజీ సంతకం చేసిన అనంతరం గోదాము తాళాలు తెరిచి ఈవీఎం, వీవీ ప్యాట్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీఓ కె.స్వాతి, మార్కెటింగ్ ఏడీ ఎల్.నిత్యానందం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వీఎంసీ ఇన్‌చార్జి
సీఎంఓహెచ్‌గా గీతాబాయి
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్యం విభాగం ఇన్‌చార్జి ప్రధాన అధికారిగా డాక్టర్ గీతాబాయిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె కృష్ణాజిల్లా డీఎంహెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్నారు. వీఎంసీ సీఎంఓహెచ్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ రత్నా వళి రెండు నెలల క్రితం బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఏఎంఓహెచ్ డాక్టర్ సురేష్‌బాబు ఇన్‌చార్జి సీఎంఓహెచ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ గీతాబాయి గతంలో వీఎంసీలో సీఎంఓహెచ్‌గా విధులు నిర్వహించారు. కోవిడ్ సమయంలో, జాతీయ స్థాయిలో ఉండే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో విజయవాడ నగర పాలక సంస్థకు నాలుగో ర్యాంకు సాధనలో ఆమె ప్రధాన భూమిక పోషించారు.
అనుక్షణం అప్రమత్తం
లబ్బీపేట(విజయవాడతూర్పు): భవానీ దీక్షల విరమణ సందర్భంగా వైద్య శిబిరాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశించారు. ఆమె శనివారం సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన ఆరు పడకల శిబిరాన్ని పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు దీక్ష విరమణ సందర్భంగా ఇంద్రకీలాద్రి పరిసరాల్లో 27 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. వాటిలో 24 గంటలూ మూడు షిఫ్టుల్లో 470 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని, 108 వాహనాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. దీక్ష విరమణకు వచ్చిన వారికి అనారోగ్య పరిస్థితులు తలెత్తితే వెంటనే దగ్గర్లోని వైద్య శిబిరంలో సేవలు పొందొచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిడిమిక్ విభాగం హెల్త్ ఆఫీసర్ ఐ.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీటీపీఎస్ ఆల్‌టైమ్ రికార్డు
ఇబ్రహీంపట్నం: ఒకరోజు అత్యధిక విద్యుత్ ఉత్పాదనలో ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ ఆల్ టైం రికార్డ్ సృష్టించిందని ఆ సంస్థ చీఫ్ ఇంజినీర్ నాగరాజు శనివారం తెలిపారు. ఇప్పటి వరకు అత్యధికంగా 50.17 మిలియన్ యూనిట్లగా ఉన్న రికార్డు అధిగమించింద న్నారు. ఈనెల 18,19, 20 తేదీల్లో వరుసగా 50.47, 50.66, 51.14 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు, కార్మికుల సమష్టి కృషితో ఈ ఘనత సాధించినట్లు సీఈ స్పష్టం చేశారు. ఏపీఎస్ ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ బ్రాంచ్ కోశాధికారి తానికొండ మణిబాబు ఆధ్వర్యంలో సీఈ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. రాష్ట్ర నాయకులు సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. సీఈ నాగరాజు అపారమైన అనుభవంతో ఎన్టీటీపీ ఎస్‌ను విజయపథంలో నడిపిస్తున్నట్లు కొని యాడారు. ఎస్‌ఈ పటేటి ప్రసాద్, డీఈలు ఈశ్వరయ్య, గోపికృష్ణ, పాపారావు, ఏడీఈలు గాంధీ, జ్ఞానేశ్వరరావు, ఏఈలు గీత లావణ్య, ప్రచార కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment