![ఘనంగా ఏఎన్నార్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09vic165-310137_mr-1739129149-0.jpg.webp?itok=uv8KLPtG)
ఘనంగా ఏఎన్నార్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం విజయవాడ ఐలాపురం హోటల్‌లో ఆదివారం జరిగింది. కళాశాల 1971– 78 పూర్వ విద్యార్థులు ‘మిత్రమా స్వాగతం’ పేరుతో సంఘంగా ఏర్పడ్డారు. ఏభై మూడు సంవత్సరాల తర్వాత అప్పటి పూర్వ విద్యార్థులు నేటి సీనియర్ సిటిజన్స్ కలుసుకున్నారు. నాటి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. డైబ్బె సంవత్సరాల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. సమ్మేళనానికి దూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆనాటి ఆంగ్ల అధ్యాపకులు చిరుమామిళ్ళ సాంబశివరావును ఘనంగా సత్కరిచారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. సమావేశంలో మిత్రమా స్వాగతం వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల మల్లికార్జునరావు మాట్లాడుతూ భవిష్యత్తులో ‘మిత్రమా స్వాగతం’ ద్వారా సామాజిక కార్యక్రమాల్లో భాగం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళనంలో తోట నరేంద్ర దేవ్, మేరుగ శివాజీ, వెన్నా వల్లభరావు కార్యవర్గ సభ్యులు కె.వి.ఎస్.ఎన్.మూర్తి, పువ్వుల సుధాకర్, వెలిచేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment