నూతన విద్యా విధానంలోనే బోధన
జయపురం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని కళాశాలల్లోనూ నూతన విద్యా విధానంలోనే బోధన జరుగుతుందని జయపురంలోని విక్రమ్‌దేవ్ విశ్వ విద్యాలయ ఓఎస్‌డీ ప్రొఫెసర్ దేవీప్రసాద్ మిశ్రా స్పష్టం చేశారు. జాతీయ నూతన విద్యా విధానంపై వర్శిటీలో 72 కళాశాలల ప్రిన్సిపాళ్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో డిగ్రీ కోర్సు మూడేళ్లు ఉండేదని, ఇకపై నాలుగేళ్లు చదవాల్సి ఉంటుందన్నారు. ఒడిశా రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్ రూపొందించిన సిలబస్‌ను అన్ని కళాశాలలు, స్వయం పాలిత కళాశాలల్లోనూ బోధించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో కాలేజ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ డైరెక్టర్ మహేశ్వర దురియ, ప్రాంతీయ విద్య విభాగ డైరెక్టర్ డాక్టర్ గోపాల్ హల్దార్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రంజన్‌కుమార్ ప్రధాన్, పి.జి.కౌన్సిల్ చైర్‌పర్శన్ డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment