ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 238 అర్జీలు
చెందిన నిర్మల కమ్యూనిటీ భవనాన్ని గ్రామంలో నిర్మించాలని వేడుకుంది. కార్యక్రమంలో ఏపీవో జి.చిన్నబాబు, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ సింహాచలం, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, పీహెచ్‌వో గణేష్, డిప్యూటీ ఈవో నారాయుడు, సీడీపీవో రంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
54 ఫిర్యాదులు స్వీకరించిన డీఎస్పీ
విజయనగరం క్రైమ్: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ఎంతగానో ఉపయోగపడుతుందని విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 54 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ ఎస్సైలు ఆర్.వాసుదేవ్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
సాలూరు రూరల్: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 238 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో సీ్త్ర శిశుసంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఇచ్చిన సమస్యలపై అధికారులు తొందరగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ ప్రజల నుంచి వినతిపత్రాలు అందుకున్నారు. ముఖ్యంగా సాలూరు మండలంలోని కరడవలస నుంచి కొత్తూరు రోడ్డు నిర్మాణానికి ఆయా గ్రామాల గిరిజనులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఇటీవల కరడవలస వెళ్లిన కలెక్టర్ ఆ గ్రామ ప్రజలకు రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఐటీడీఏ అధికారులకు పిలిచి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కదా? రోడ్డు నిర్మాణానికి ఎస్టిమేషన్ పంపించారా? లేదా? అని ఐటీడీఏ డీఏను ప్రశ్నించారు. కొంతమంది రైతులు తమ భూమి అన్యాక్రాంత మైందని, ఈ విషయంలో రెవెన్యూ అధికారులు న్యాయం చేయడం లేదని ఫిర్యాదు అందజేశారు. అలాగే మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తమకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అంతా టీడీపీ నాయకులు చెప్పినట్లే మండల అధికారులు నడుచుకుం టున్నారని వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే పురోహితుని వలస మోడల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు సాయంత్రం పూట ఆర్టీసీ బస్సు సమయానికి రావడం లేదని పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌కు 9 ఫిర్యాదులు
పార్వతీపురంటౌన్: ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తున్నట్లు ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి 9 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భర్త, అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించారు.
పబ్లిక్ గ్రీవెన్స్‌సెల్‌కు 56 వినతులు
ీసతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 56 వినతులు వచ్చాయి. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇప్పించాలని సవర బొంతుకు చెందిన జ్యోతి కోరారు. చాకలిగూడకు చెందిన రాము అంగన్‌వాడీ భవనం మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. తాగునీటి బోరు మంజూరు చేయాలని భరణికోట గిరిజనులు వినతి ఇచ్చారు. కోదుల వీరఘట్టానికి చెందిన నీలకంఠం నాటు కోళ్ల ఫారం పెట్టుకోవడానికి రుణం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాడు. కోసింగూడకు
Comments
Please login to add a commentAdd a comment