వైభవంగా ‘పూర్ణాహుతి’
● పట్టాభిషిక్తుడైన శ్రీరామచంద్రస్వామి ● దర్శించుకున్న ఎమ్మెల్యే నాగమాధవి, ఎమ్మెల్సీ సురేష్‌బాబు
నెల్లిమర్ల రూరల్:
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు సోమవారంతో వైభవంగా ముగిశాయి. గడిచిన నాలుగు రోజుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన రుత్విక్కులు ,దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సోమవారం వేకువజామున స్వామివారికి ప్రాతఃకాలార్చన, బాలభోగం అర్పించిన తరువాత యాగ శాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామిని ఆస్థాన మం
టపంలో వేచేంపు చేసి స్వామికి శాంతి కల్యాణం జరిపిం చారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫలరసాలతో పట్టాభిషేకమహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, తదితరులు యాగశాలలో నిర్వహించిన ప్రత్యేకహోమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం సీతారామస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్‌కుమార్ ఆచార్యులు, నాయకులు చనమల్లు వెంకటరమణ, అంబళ్ల అప్పలనాయుడు, రవ్వా నాని, లక్ష్మణరావు, సిబ్బంది రామారావు, తులసి, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment