రక్తదానం ప్రాణదానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం ప్రాణదానం

Published Tue, Oct 1 2024 12:56 AM | Last Updated on Tue, Oct 1 2024 12:56 AM

రక్తద

రాజాం సిటీ: మనిషి జీవప్రక్రియలో ప్రధాన రవాణా సాధనం రక్తం. శరీరాన్ని సమతూకంలో ఉంచాలంటే దాని ప్రాధాన్యం ఎంతో ఉంది. శరీరంలోని రక్తం పరిమాణం తగ్గితే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. రక్తం ఎర్ర, తెల్ల రక్తకణాలు, ప్లాస్మా కలిగి ఉన్న మిశ్రమద్రావణం. శస్త్రచికిత్సలు, ప్రమాదాలు ఇతరత్రా సమయాల్లో మనిషికి రక్తం చాలా అవసరం అవుతుంది. అత్యవసర సమయాల్లో రక్తం అందించి బాధితులను ఆదుకునేవారే ప్రాణదాతలు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండగా, ప్రస్తుతం సేకరిస్తున్న రక్తం ఆపదలో ఉన్నవారికి సరిపోవడంలేదు. రక్తదాన ఆవశ్యకతను తెలుసుకుని మేమున్నామంటూ కొంతమంది ముందుకొచ్చి రక్తదానం చేయడంతోపాటు అడపాడదపా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలతో అపాయంలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి, అత్యవసర చికిత్సలు అవసరమైన వారికి రక్తం ఎంతో అవసరం. రక్తాన్ని ఒకరి నుంచి మరొకరికి అందించాల్సిందే కానీ కృత్రిమంగా తయారుచేయలేం. అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానం అంటారు. ఒకరి రక్తం మరొకరి ఆయుష్షును కాపాడుతుంది.

రక్తదానానికి వీరు అర్హులు....

●అపోహలు వీడి రక్తదానం చేయాలనుకునేవారు ఆరోగ్యంగా ఉండడంతోపాటు 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు, 50 కిలోల బరువు కలిగిఉండాలి.

●హిమోగ్లోబిన్‌ శాతం 12.5 ఉండాలి.

●చికెన్‌గున్యా, టైఫాయిడ్‌, మలేరియా, ఇతర వ్యాధులు సోకిన వారు నయం అయిన తరువాత నాలుగు నుంచి ఆరు నెలల తరువాత రక్తదానం చేయవచ్చు.

●రక్తదానం చేసేవారి నుంచి కేవలం 300 మిల్లీ లీటర్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తారు.

●రక్తాన్ని సేకరించే ముందు వైద్యులు దాత ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు.

రక్తదానం ఒక బాధ్యత..

ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం బాధ్యతగా చేస్తుంటాను. ఇప్పటి వరకు శిబిరాల ద్వారా, స్వచ్ఛందంగా 50 సార్లు రక్తదానం చేశాను. ఆపదలో ఉన్నవారికి ఇలా ఉపయోగపడడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా ఎవరికై నా ఏ సమయంలో అవసరమైనా రక్తం ఇచ్చేందుకు నేను సిద్దం.

శనపతి రాము, రక్తదాత, పొగిరి

రక్తం ఎంతో విలువైనది..

రక్తం ఎంతో విలువైనది. ప్రమాదాలు, శస్త్రచికిత్సల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. యువత స్ఫూర్తితో ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే రక్తదానం చేయడం ద్వారా కొత్త రక్తం ఉత్పత్తి అయి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కొత్తా సాయిప్రశాంత్‌కుమార్‌,

రెడ్‌క్రాస్‌ అధ్యక్షుడు, రాజాం

అవగాహనతో యువత ముందుకు రావాలి

నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం

No comments yet. Be the first to comment!
Add a comment
రక్తదానం ప్రాణదానం1
1/2

రక్తదానం ప్రాణదానం

రక్తదానం ప్రాణదానం2
2/2

రక్తదానం ప్రాణదానం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement