విచారణ ఆరంభం
● భరత్‌పూర్ కేసులో విచారణ
చేపట్టిన ఏకసభ్య కమిషన్
● హైకోర్టుని ఆశ్రయించిన నిందితులు
ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరిలో భరత్‌పూర్ ఠాణా ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జి ఒకరు కాగా, 2 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఒక సహాయ సబ్ ఇనస్పెక్టర్, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. వీరంతా ముందస్తు బెయిల్ కోసం రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించారు.
● గుజరాత్‌లో పరీక్షలు
ప్రధాన నిందితుల వాంగ్మూలం నిజానిజాల ధ్రువీకరణ కోసం ఉన్నత స్థాయి పరీక్షలు చేపడుతున్నారు. స్థానిక సబ్ డివిజినల్ జుడీషియల్ మేజిస్ట్రేట్ అనుమతి మేరకు 5 మంది నిందితులను గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరికి తరలించారు. అక్కడ అబద్ధ నిర్ధారణ (లై డిటెక్షన్), బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో విశ్లేషణ వంటి పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి పూట రోడ్డు రోమియోల ఆగడాలతో భరత్‌పూర్ పోలీసు ఠాణాలో కేంద్రీకృతం అయింది. బాధితురాలి గోడు మీడియాలో ప్రసారం కావడంతో అనుబంధ వర్గాలు ఉలికిపాటుకు గురయ్యాయి. తక్షణమే నిందిత సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తు కోసం క్రైం శాఖ రంగంలోకి దిగింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య న్యాయ కమిషన్ నియమించి 60 రోజుల్లో నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ సంఘటనపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్వయంగా చొరవ కల్పించుకోవాలని సైనిక సిబ్బంది వర్గం బహిరంగ లేఖ జారీ చేసింది. దీని ప్రభావంతో విచారణకు స్వీకరించిన హైకోర్టు ఠాణాలో పోలీసుల వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధితురాలికి సెప్టెంబర్ 18వ తేదీన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
భువనేశ్వర్: రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన భరత్‌పూర్ ఠాణా కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చే ప్రక్రియ ఆరంభం అయింది. ఈ సంఘటనపై ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రైం శాఖ దర్యాప్తు కొనసాగుతుండగా పరిస్థితి సమస్యాత్మకం కావడంతో ఏకసభ్య న్యాయ కమిషన్‌తో విచారణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విశ్రాంత జస్టిస్ చిత్తరంజన్ దాస్ అధ్యక్షతన న్యాయ కమిషన్ విచారణ సోమవారం నుంచి ఆరంభమైంది. స్థానిక ప్రత్యేక సర్క్యుట్ హౌస్‌లో న్యాయ కమిషన్ విచారణ చేపట్టింది. తొలిరోజు విచారణకు రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి సత్యబ్రత సాహు, పోలీసు డైరెక్టర్ జనరల్ వై.బి.ఖురానియా హాజరయ్యారు.
● నేటి నుంచి అఫిడవిట్ల దాఖలు
భరత్‌పూర్ సంఘటనలో పలు ఆరోపణలు, ప్రత్యారోపణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన సమాచారం ఆధారిత వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేసేందుకు న్యాయ కమిషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ జారీ అవుతుందని న్యాయ కమిషన్ కార్యదర్శి తెలిపారు. 21 రోజులపాటు అఫిడవిట్ దాఖలు ప్రక్రియ నివధింకగా కొనసాగుతుందని తెలిపారు.
● ముందస్తు బెయిల్‌కు సన్నాహాలు
ఈ ఘటనలో 5 మంది పోలీసుస్టేషన్ సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment