డోలీపైనే ఆస్పత్రికి తరలింపు
మల్కనగిరి: రహదారి సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యానికి గురైన ఒక వ్యక్తిని డోలీపై మోసుకుంటూ వైద్య కేంద్రానికి తీసుకెళ్లిన ఘటన జిల్లాలొని చిత్రకొండ సమితి నువాగడ పంచాయతీ పరిధి రథగుడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రథగుడ గ్రామానికి చెందిన డమ పూజారి (50) అనారోగ్యంతో గత కొద్ది రోజులుగా బాధపడుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొని వెళ్లాలని అనుకున్నారు. అయితే రథపూట్ గ్రామం నుంచి మంత్రిపుట్ గ్రామానికి చేరుకోవడానికి వంతెన లేకపోవడంతో వాహనాల రాకపోకలకు అవకాశం లేదు. దీంతో ఎటువంటి సమస్య వచ్చినా రథగుడ గ్రామానికి చెందిన ప్రజలు సుమారు 8 కిలొమీటర్ల దూరం వరకు రోగులను డోలీపై మోసుకుంటూ మంత్రిపుట్‌కు చేరుకోవాలి. అందువలన డమ పూజారిని డోలీలో తీసుకొని వెళ్లారు. అందువలన ఇప్పటికై నా అధికారులు, నాయకులు ఇప్పటికై నా స్పందించి ఈ రెండు గ్రామాలకు అనుసంధానించే విధంగా వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment