వైద్యుల పోస్టులు భర్తీ చేయండి
రాయగడ: ఆదివాసీ, హరిజన ప్రాంతమైన రాయగడ జిల్లాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ మోర్చ ఉపాధ్యక్షుడు కాళీరాం మాఝిలు కోరారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని 11 సమితుల్లో ఉన్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో 461 మంది వైద్యులు ఉండాల్సి, ఉన్నప్పటికీ ఆయా వైద్య కేంద్రాల్లో కేవలం 147 మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. దీంతో వైద్యుల కొరత కారణంగా రోగులు అత్యవసర పరస్థితుల్లో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నం అలాగే బరంపురం, కొరాపుట్ ప్రాంతాలకు మెరుగైన చికిత్స కోసం వెళ్లాల్సి వస్తోందని వివరించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment