అంత్యక్రియలకు అవస్థలు
కొరాపుట్: మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు పీకల్లోతు నీటిలో వెళ్తూ అవస్థలు పడిన ఘట న నవరంగ్పూర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మర్‌కోట్ పట్టణంలోని 8వ వార్డులో ఒక వృద్ధుడు సోమవారం మృతి చెందాడు. దీంతో మృతదేహానికి ఆ గ్రామ శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తాయి. శ్మశానానికి, గ్రామానికి మధ్యలో ఉన్న కెనాల్‌పై వంతెన లేకపోవడంతో పీక ల్లోతు నీటిలోనే మృతదేహాన్ని తీసుకొని వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఇప్పటికై నా అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment