స్వచ్ఛతపై సైన్స్ ఎగ్జిబిషన్
స్వచ్ఛ యే సేవ అన్న అంశంపై జయపురం మున్సిపాలిటీ విద్యార్థుల మధ్య ఆర్ట్స్, క్రాఫ్ట్ పోటీలతో పాటు సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలను నిర్వహించింది. స్థానిక నారాయణి కళాశాల ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ఈ పోటీల్లో పట్టణంలోని వివిధ పాఠశాలల నుంచి 412 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్‌మెంట్‌పై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు తమకు అభిప్రాయాలను చిత్ర లేఖన, బొమ్మల, విజ్ఞాన ప్రదర్శనల ద్వారా వ్యక్తం చేశారు. బృహత్తర లక్ష్యంతో నిర్వహించిన పోటీల కార్యక్రమంలో చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, వైస్ చైర్మన్ బి.సునీత అతిథులుగా విద్యార్థులను ఉత్సాహపరిచారు. – జయపురం
కలుషిత నీరు మేనేజ్‌మెంట్ ప్రయోగ శాలపై చైర్మన్‌కు వివరిస్తున్న విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment