‘సమస్యలు పరిష్కరించాలి’
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మౌలిక సమస్యలపై త్వరలో ఆందోళన చేపట్టనున్నామని ఆ సంఘం అధ్యక్షుడు రాజీవ్ పాఢి తెలిపారు. స్థానిక రాజవీధిలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. అతి తక్కువ వేతనంతో ఆరేళ్లుగా కలెక్టరేట్, మెడికల్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేశామని, అయినా తమ సర్వీసులను రెగ్యులర్ చేయలేదని అవేదన వ్యక్తం చేశారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి అనేక సేవలు అందించినా కొంతమందిని విధుల నుంచి తొలగించడం నేరమని వాపోయారు. తొలగించిన వారిని వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని, జీతాలు పెంచాలని, దినసరి వేతనం అందుకుంటున్న ఎన్‌ఎంఆర్‌లతో సమానంగా పరిగణించాలని కోరారు. సమావేశంలో సంఘం కార్యదర్శి పంకజ్ కుమార్, కోశాధికారి తపస్‌కుమార్ మిశ్రా, ఆర్గనైజింగ్ సెక్రటరీ మానస్ కుమార్ మిశ్రా, సాధారణ కార్యదర్శి మానస్ కుమార్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment