ఆదివాసీ మహా సంఘం ఏర్పాటు
జయపురం: సమితి స్థాయి ఆదివాసీ మహా సంఘాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. గొడొపొదర్ గ్రామం బిరపాణి మందిర ఆవరణలో పొరజ, అమనాత్య, గదబ, సౌర, కంద, దొర, భూమియ, హలబ, భొత్ర తదితర ఆదివాసీ సాంప్రదాయ ప్రజా సంఘాల ప్రతినిధిలు గిరిజన నేత ఆనంద హలవ అధ్యక్షతన సమావేశమయ్యారు. దీనిలో భాగంగా సమితి స్థాయి ఆదివాసీ మహా సంఘం ఏర్పాటు చేశారు. సమితిలోని అన్ని ఆదివాసీ సాంప్రదాయ ప్రజలంతా ఏకం కావాలని, సమస్యలు సమైఖ్యంగా పరిష్కరించుకునేందుకు మహాసంఘం ఏర్పాటు అవసరమని ఆనంద హలవ వివరించారు. గిరిజనుల్లో ఎన్ని తెగలున్నా వారంతా ఆదివాసీలేనని నొక్కి చెప్పారు. అనంతరం సమావేశంలో నూతన సంఘం కోసం ఎన్నికలు నిర్వహించారు. మహా సంఘానికి అధ్యక్షుడిగా జితేంధ్ర నాయిక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షుడిగా ఆనంద హలవ, కార్యదర్శిగా భగవాన్ ఖెందు, సహాయ కార్యదర్శిలుగా బలభద్ర గదబ, నవీన జాని, కోశాధికారులుగా శశిభూషణ భూషణ సౌర, గంగాధర హలవ తదితరులను ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment