వైద్య రంగానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

వైద్య రంగానికి పెద్దపీట

Published Tue, Oct 1 2024 1:02 AM | Last Updated on Tue, Oct 1 2024 1:02 AM

వైద్య రంగానికి పెద్దపీట

వైద్య రంగానికి పెద్దపీట

నవరంగపూర్‌ ఎంపీ బలభద్ర మాఝి

మల్కన్‌గిరి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని నవరంగపూర్‌ ఎంపీ బలభద్ర మాఝి అన్నారు. జిల్లాలోని పోడియాలో కొత్తగా నిర్మించిన పీహెచ్‌సీని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. గత 25 ఏళ్ల బీజేడీ పాలనలో రాష్ట్రం తిరగమనం వైపునకు ప్రయాణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నరసింహ మడ్కామి, జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్‌ ధనేశ్వర్‌ మహాపాత్రో, పొడియా సమితి బీడీవో అభిమన్యు కవిసతపతి, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ సిద్దార్థ్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement