వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలో గుణుపూర్‌లోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వినతుల స్వీకరణ కార్యక్రమం కలెక్టర్ ఫరూల్ పట్వారి అధ్యక్షతన సోమవారం జరిగింది. కార్యక్రమంలో గుణుపూర్ సబ్ కలెక్టర్ కిరణ్ దీప్ కౌర్ సహాట, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. గుణుపూర్ పరిసర ప్రాంతాలకు చెందిన 68 వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. వీటిలో 30 గ్రామ సమస్యలు కాగా, 38 వ్యక్తిగత సమస్యలు విన్నారు. ఆవాస్ యోజన పథకంలో ఇళ్ల మంజూరు, వైద్య సమస్యలు, తాగు, సాగునీటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకుని త్వరలో పరిష్కారమయ్యేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఒక వ్యక్తికి వీల్‌చైర్‌ను పంపిణీ చేశారు.
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ సమితి మర్లబ్ పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. దీనిలో ఆర్డీఏ సీడీఎం గుణనిధి నాయక్, అదనపు ఎస్పీ సునీల్ మహంతి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 293 వినతులు అధికారులకు అందగా, వాటిలో 150 వినతులు వెంటనే పరిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment