పాతపట్నం: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజుల పాలన పూర్తయినప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడంలో విఫలమైందని, ఊళ్లలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, అరాచకాలతో పాలన సాగిస్తున్నారని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. మండలంలోని ప్రహరాజపాలేంలో వైఎస్సార్ జగనన్న కాలనీలోని నిర్మించిన ఆర్చిపై ఉన్న వైఎస్సార్ జగనన్న కాలనీ పేరును దుండగులు తొలగించారు. ఆ ఆర్చిని నాయకులతో కలిసి ఆమె సోమ వారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాలనలో భూ ఆక్రమణలు, ఇసుక దోపిడీ, కక్ష సాధింపు తప్ప ఇంకేమీ చేయలేదని గుర్తు చేశారు. ఆమెతో పాటు ఎంపీపీ దొర సావిత్రమ్మ, వైఎస్సార్‌సీపీ మండల అధ్య క్షుడు సవిరిగాన ప్రదీప్, మాజీ సచివాలయ మండల కన్వీనర్ ఎనుగుతల సూర్యం, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ మడ్డు తాతయ్య, మండల ప్రత్యేక సలహాదారుడు ఎం.గణపతిరావు, కోఆప్షన్ సభ్యుడు మాదవ్ పుల్లాయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment