డీఆర్ఓ సేవలు మరువలేనివి
పార్వతీపురం: జిల్లా రెవెన్యూ అధికారిగా జి.కేశవనాయుడు అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. అనంతపురం బదిలీపై వెళ్తున్న కేశవనాయుడుకు కలెక్టర్ కార్యాలయంఓ ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డీఆర్ఓ అంకిత భావంతో పనిచేసి ఈ ప్రాంతీయుల మన్ననలను పొందారన్నారు. సిబ్బందికి మార్గదర్శకం వహించడంలోను పై అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వడంలోను సమన్వయం చేశారన్నారు.
ఎన్నికల వేళ చాకచక్యంగా పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకు వచ్చారన్నారు. బదిలీపై వెళ్తున్న కేశవనాయుడు మాట్లాడుతూ జిల్లాలో పని చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారి ఎండీ గయాజుద్దీన్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి ఎల్.రమేష్, కలెక్టర్ పరిపాలన అధికారి సావిత్రి, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment