సామాన్యుడిలా సీఎం దీపావళి వేడుక
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి దీపావళి పండగ ముచ్చటగా జరుపుకున్నారు. సంప్రదాయ సామగ్రి కొనుగోలు కోసం స్థానిక యూనిట్ – 1 సంతకు వెళ్లారు. ఆయనతో సతీమణి కూడా సంతకు వెళ్లి సాధారణ పౌరుల తరహాలో పండ్లు, కాయలు, పూలు వగైరా కొనుగోలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి స్వగ్రామం రాయికిలా ప్రాంతంలో గ్రామస్తులతో కలిసి మెలిసి సంప్రదాయ గానాబజానా కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. స్థానిక జానపద గీతాలకు లయబద్ధంగా డోలు బజాయించి ఉర్రూతలూగించారు. ఆకాశ జ్యోతిని నింగికి విడిచి దీపావళి వెలుగుల్ని విరజిమ్మించారు.
Comments
Please login to add a commentAdd a comment