●శ్రీ క్షేత్రంలో కాగడా దీపావళి
కూలీల వాహనం బోల్తా
సోంపేట: మండలంలోని కొర్లాం సబ్‌స్టేషన్ సమీపంలో బారువ– కొర్లాం రహదారిలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. బారువ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచిలి మండలం పూర్ణశాసనాం గ్రామానికి చెందిన దినసరి కూలీలు బారువ మేజర్ పంచాయతీ దాసరిగూడెం వీధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం బొలెరో వాహనంలో బయల్దేరారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో కొర్లాం సబ్‌స్టేషన్ సమీపంలో వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కూలీలంతా కిందపడి గాయాలు కావడంతో వెంటనే బారువ సామాజిక ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ బాలకృష్ణ, దుర్యోధన ప్రథమ చికిత్స నిర్వహించారు. ఎం.గాయత్రి, ఎం.సున్నమ్మ, శకుంతల బెహరా, ఎం.దమయంతి, ఎం.రుక్ష్మిణిలకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాకుళం జెమ్స్‌కు తరలించారు. బబ్బి బెహరా, కై లాస్ బెహరా, ఎం.కేశమ్మ, తిలోత్తమ బెహరా, రాజేశ్వరి బెహరా, రాజు బెహరాలను టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కంచిలి ఎంపీపీ పైలదేవదాస్ రెడ్డి, శాసనాం సర్పంచ్ వేణు, సోంపేట మండల నాయకులు బుద్దాన శ్రీకృష్ణ సామాజిక ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బారువ ఏఎస్‌ఐ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
11 మందికి గాయాలు
కొర్లాం–బారువలో రోడ్డులో ఘటన
Comments
Please login to add a commentAdd a comment