No Headline
విజయనగరం ఫోర్ట్: ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, సీహెచ్‌సీ వైద్యులు క్లిష్టతరమని రిఫర్ చేసిన గర్భిణులకు 108 అంబులెన్స్ సిబ్బంది ఎంతో సులువుగా ప్రసవాలు జరిపించేస్తున్నారు. ఆస్పత్రి వైద్యులు సిజేరియన్ అవ్వాలని రిఫరల్ ఆస్పత్రికి రిఫర్ చేసిన కేసులను సైతం 108 సిబ్బంది చాకచక్యంగా ప్రసవాలు చేయడం ఇక్కడ గమనించదగ్గ విషయం.
రిఫరల్స్‌కే ప్రాధాన్యమిస్తున్న ఆస్పత్రులు
సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులకు ఎక్కువగా గర్భిణులు ప్రసవం కోసం వస్తారు. అక్కడ వైద్య సిబ్బంది ప్రసవాలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రసవాలు అయ్యే గర్భిణులను సైతం ఘోషాస్పత్రికి, కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా రిఫర్ చేసే కేసులను రిఫరల్ ఆస్పత్రులకు తరలించే సమయంలో మార్గమధ్యలో 108 సిబ్బంది ప్రసవాలు నిర్వహిస్తున్నారు. జనవరి నెల నుంచి అక్టోబర్ నెలఖారు వరకు 108 అంబులెన్సులలో 42 ప్రసవాలు జరిగాయి. ప్రతి నెల 108 అంబులెన్సులో ప్రసవాలు జరుగుతున్నాయి.
అనంతగిరి మండలం కొత్తరూకు చెందిన వంతల వనజకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్సుకు ఫోన్ చేసారు. సమాచారం అందుకున్న తర్వాత 108 సిబ్బంది గ్రామానికి చేరుకుని గర్భిణి వనజను ఎస్.కోట ఏరియా ఆస్పత్రి తరలిస్తుండగా మార్గ మాధ్యలో పురిటి నొప్పులు రావడంతో 108అంబులెన్స్ ఈఎంటీ మౌనిక గర్భిణి వనజకు ప్రసవం జరిపించారు. ఆమెకు ఆడశిశువు జన్మించింది.
Comments
Please login to add a commentAdd a comment