అగ్ని ప్రమాదంలో రూ.60లక్షల ఆస్తి నష్టం
చీపురుపల్లి: దీపావళి పండగ రోజున ఓ ఆటోమొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు రూ.60లక్షల ఆస్తినష్టం సంభవించింది. ఈ సంఘటనకు సంబందించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మెయిన్‌రోడ్‌లోని ఆంజనేయపురంలో మాధురి ఆటోమొబైల్ దుకాణాన్ని గెంబలి శ్రీనివాసరావు అనే దివ్యాంగ యువకుడు నిర్వహిస్తున్నాడు. శ్రీనివాసరావు దివ్యాంగుడైనప్పటికీ ఎంతో ధైర్యంతో 2016లోనే ఇక్కడ ఆటోమొబైల్ దుకాణాన్ని ఏర్పాటు చేసాడు. అప్పటి నుంచి వ్యాపారాన్ని విస్తరిస్తూ పట్టణంలో ప్రధాన ఆటో మొబైల్ దుకాణాల్లో ఒకటిగా నిలిపాడు. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆటో మొబైల్ దుకాణాంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగాయి. దుకాణంలో అధిక సంఖ్యలో వాహన టైర్లు, ట్యూబ్‌లు ఉండడంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ దుకాణంలో ఉన్న మొత్తం వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. రూ.60లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు యజమాని లబోదిబోమంటున్నాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు శుక్రవారం ఉదయాన్ని సంఘటనా స్థలానికి వెళ్లి బాధితుడు శ్రీనివాసరావుకు ధైర్యం చెప్పి, భీమా కంపెనీల ప్రతినిధులతో న్యాయం చేయాలని మాట్లాడారు.
నా ఆధారం పోయింది
దివ్యాంగుడైనప్పటికీ కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవాలని 2016లో ఆటో మొబైల్ దుకాణం ఏర్పాటు చేసానని బాధితుడు గెంబలి శ్రీనివాసరావు అన్నారు. అలా కష్టపడుతూ దుకాణ సామర్థ్యాన్ని పెంపొందించానని ఈ దుకాణం ఆధారంగానే కుటుంబాన్ని పోషించుకుంటున్నానని ఇప్పుడు అగ్నిప్రమాదం సంభవించడంతో సర్వం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసాడు.
ఆటోమొబైల్ దుకాణాంలో ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment