మంచం పట్టిన ఎరుకొండ
పూసపాటిరేగ: మండలంలోని ఎరుకొండ గ్రామంలో డయేరియా ప్రబలింది. తీవ్ర అస్వస్థతకు గురై ఒకరు మృతి చెందగా, మరో 12 మంది పూసపాటిరేగ పీహెచ్‌సీ, సుందరపేట సీహెచ్‌సీలో వైద్యసేవలు పొందుతున్నారు. ఆస్పత్రిలో మృతిచెందిన పచ్చిపులుసు వెంకట రమణ (75) గత కొంత కాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర వ్యాధులతో ఇబ్బందిపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. డయేరియాకు కారణాలపై ఆరా తీస్తున్నారు. తాగునీటి బోర్లు, రక్షిత మంచినీటి పథకం నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు ల్యాబ్‌కు పంపించినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ప్రవీణ్‌శంకర్ తెలిపారు. గ్రామాన్ని జిల్లావైద్యారోగ్యశాఖ అధికారి భాస్కరరావు, తహసీల్దార్ తాడ్డి గోవింద, ఎంపీడీఓ ఎం.రాధిక, వైద్యాధికారి రాజేష్‌వర్మలు శుక్రవారం సందర్శించారు. మురుగునీటి కాలువలు, తాగునీటి వనరులను శుభ్రం చేయాలని స్థానిక సిబ్బందికి సూచించారు. వైద్యాధికారులు కడగల త్రినాథ్, ఎస్.ప్రమీలాదేవి, సర్పంచ్ గొట్టాపు అప్పలస్వామి, వైద్య సిబ్బంది ఆర్.వి.రమణ, జి.బంగారుబాబు తదితరులు గ్రామంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరంలో సేవలందించారు.
డయేరియాతో ఒకరు మృతి
ఆస్పత్రిలో చేరిన 12 మంది గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment