క్రీడాకారుడు ఉపేంద్ర మహరాణ మృతికి సంతాపం
జయపురం: కొరాపుట్ జిల్లాలో ప్రముఖ క్రీడాకారుడు ఉపేంద్ర మహరాణ అకాల మృతిపై క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక విక్ర మ మైదానంలో శుక్రవారం సంతాప సభ నిర్వహించారు. ఉపేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. జయపురం సబ్‌డివిజన్ అట్లథిక్ అసోసియేషన్ కార్యదర్శి రబి నాయిక్ అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభలో ఉపేంద్ర మహారాణ క్రీడా రంగానికి చేసిన సేవలు కొనియాడారు. ఆయన ఆకస్మిక మృతి క్రీడాలోకానికి తీరని లోటన్నారు. ఉపేంద్ర పుట్‌బాల్, వాలీబాల్ విశేష ప్రతిభ ప్రశంసనీ యమన్నారు. అతడి శిక్షణతో పలువురు యువకులు మంచి ఆటగాళ్లు అయ్యారని గుర్తు చేశారు. సంతాపసభలో మోహణ గౌఢ, మోహణ మఝి, శివశంకర బిశ్వాల్, రమేష్ సాహు, తరుణ కుమార్ మహాప్రాత్ర, టిను పాణి గ్రహి, బలియ పాణిగ్రహి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment