రాజ్యాంగం పరమ పవిత్రం
భువనేశ్వర్: జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం ప్రాముఖ్యత, దాని ప్రాథమిక సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో మంగళవారం స్థానిక ఏజీ స్క్వేర్ నుంచి క్యాపిటల్ ఆస్పత్రి వరకు పాద యాత్ర నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, పలువురు మంత్రులు భారత రాజ్యాంగం చైతన్య పాదయాత్రలో పాల్గొన్నారు. భారతీయులు అందరికీ రాజ్యాంగ దినం పవిత్రమైనదిగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. పాదయాత్రలో భాగంగా ఆయన ప్రసంగించారు. దేశంలో ప్రజా స్వామ్య పాలనకు రాజ్యాంగం మార్గ నిర్దేశక శక్తిగా పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ భారత రాజ్యాంగం జాతీయ దినోత్సవం రాష్ట్ర స్థాయిలో నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానిక ఏజీ స్క్వేర్‌లో రాజ్యాంగ ఆవిష్కర్త డాక్టరు బీఆర్ అంబేడ్కర్ శిలా విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం క్యాపిటలు ఆస్పత్రి వరకు పాద యాత్ర నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment