మునిగుడలో అండర్‌ గ్రౌండ్‌ నిర్మాణానికి సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

మునిగుడలో అండర్‌ గ్రౌండ్‌ నిర్మాణానికి సన్నాహాలు

Published Wed, Nov 27 2024 7:39 AM | Last Updated on Wed, Nov 27 2024 7:39 AM

మునిగుడలో అండర్‌ గ్రౌండ్‌ నిర్మాణానికి సన్నాహాలు

మునిగుడలో అండర్‌ గ్రౌండ్‌ నిర్మాణానికి సన్నాహాలు

రాయగడ: మునిగుడలో రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద అండర్‌ గ్రౌండ్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కొద్ది రొజుల క్రితం మునిగుడలో గల ప్రగతి మంచ్‌ ఆధ్వర్యంలో వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు, ప్రగతి మంచ్‌ సభ్యులు, వ్యాపార, వాణిజ్య సంఘాలు అండర్‌ గ్రౌండ్‌ ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు స్పందించిన రైల్వే శాఖ మంగళవారం నాడు రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద అండర్‌ గ్రౌండ్‌ ఏర్పాటుకు సంబంధించి సర్వే నిర్వహించింది. ప్రగతి మంచ్‌ సభ్యులు ఈ సందర్భంగా రైల్వే యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement