విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
పర్లాకిమిడి: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. జిల్లాలోని గుసాని బ్లాక్ లింగుపురం గ్రామంలోని ఆదర్శ విద్యాలయం ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం ఉత్సాహంగా జరిగినది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రూపేష్ మాట్లాడుతూ.. ఆదర్శ విద్యాలయం విద్యార్థులు వార్షిక క్రీడల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించాలని అన్నారు. కార్యక్రమంలో గుసాని సమితి అధ్యక్షులు ఎన్.వీర్రాజు, తహసీల్దార్ నారాయణ బెహరా, బీజేడీ నేత నిరో భుయ్యాన్, ఆదర్శ విద్యాలయం సంఘటన్ వైస్ ప్రిన్సిపాల్ డంగు యాదవ్‌రావు, విద్యాలయం నిర్వాహణ అభివృద్ధి కమిటీ సభ్యులు పిత్తబసు, సర్పంచు, సమితి సభ్యులు కిరణ్ పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment