ధాన్యం మండీ ప్రారంభం
జయపురం: హడియలో ధాన్యం మండీని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ఆదివారం ప్రారంభించారు. జయపురం రెగ్యులేటింగ్ మార్కెటింగ్ కమిటీ నిర్వహించన సభలో మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించాలని కోరారు. మండీల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మిల్లర్లు, ప్రభుత్వ సంస్థలు, ప్రొక్యూర్‌మెంట్ ఏజంట్లు రైతుల నుంచి ధాన్యం కొనాలని స్పష్టం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయకపోతే అకాల వర్షాల కారణంగా ధాన్యం తడచి రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే అన్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యం అంతా కొనుగోలు చేయకపోతే మరో మార్గం లేక రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవల్సి వస్తుందని, అందువలన రైతు నష్టపోతాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ధాన్యం కొనాలని బాహిణీపతి విజ్ఞప్తి చేశారు. మిల్లర్లకు, రైతులకు మధ్య సమస్యలు ఏర్పడిన అధికారులు ఉభయ వర్గాలను సమావేశపరచి పరిష్కరించి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సభ్యుడు తిపతి పట్నాయక్, హడియ సర్పంచ్ సురేష్ బస్తిరియ, సీనియర్ కాంగ్రెస్ నేత భాస్కర పట్నాయక్, జయపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత నాయక్, మండీ పరిచాలకులు భక్త చరణ టక్రి, స్వయం సహాక గ్రూప్ గురువారీ హరిజన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment