అలరించిన స్వరగానామృత లహరి
పర్లాకిమిడి: స్థానిక జంగం వీధి వద్ద సింహాద్రి అప్పన్న ఫంక్షన్ హాలులో చైతన్య మెలోడీస్ ఆధ్వర్యంలో స్వరగానామృతలహరి అధ్యక్షులు ఇసై వెంకట్రావు ఆధ్వర్యంలో వీనులవిందుగా జరిగినది. పాతపట్నానికి చెందిన పారశెల్లి రామరాజు మాస్టారు స్వరగానా మృత లహరి కార్యక్రమాన్ని ప్రారంభించగా.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పాతపట్నం ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మందికిపైగా గాయనీగాయకులు తెలుగు, హిందీ పాటలు పాడారు. ఔత్సాహిక గాయనీ గాయకులను ప్రోత్సాహించేందుకు చైతన్య మెలోడీస్ ఏర్పాటు చేసుకున్నామని కార్యదర్శి టి.కిశోర్ తెలిపారు. కార్యక్రమంలో విజేతలకు సాయంత్రం బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమం విజయవంతానికి కె.చిరంజీవులు, వెంకట్, పి.శ్రీనివాస్, శివ కృషిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment