ప్రెస్ యూనియన్ నూతన కార్యవర్గం
రాయగడ: ప్రెస్ యూనియన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. స్థానిక గాయత్రీనగర్ వద్ద గల సీనియర్ సిటిజన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. యూనియన్ అధ్యక్షులుగా అమూల్య రత్నసాహు, ఉపాధ్యక్షునిగా వెంకటి పాఢి, కార్యదర్శిగా శివాజీ దాస్, సహకార్యదర్శిగా మృత్యుంజయ నంద, కొషాధికారిగా రస్మీరంజన్ దొరలు నియమితులయ్యారు. యూనియన్ ముఖ్యసలహాదారుడిగా సురేష్ దాస్ వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా యూనియన్ భవిష్యత్ కార్యకలాపాలకు సంబంధించి ఈ సందర్భంగా సమావేశంలో చర్చించారు. రెండేళ్ల పాటుగా కొత్త కార్యవర్గం కొనసాగుతుందని కార్యదర్శి దాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment