గణితంపై ఆసక్తి చూపాలి
పర్లాకిమిడి: గణితంపై భయాన్ని వీడి ఇష్టాన్ని పెంచుకోవాలని వక్తలు అన్నారు. గుసాని బ్లాక్ జాజిపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక అప్‌గ్రేడ్ పాఠశాలలో జాతీయ గణిత విజ్ఞాన దినోత్సవాన్ని జిల్లా ముఖ్యవిద్యాధికారి డాక్టర్ మాయాధర సాహు ఆదేశాలమేరకు జిల్లా సైన్సు కోఆర్డినేటర్ ఎ.రవికుమార్ ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు సాత్మిక్ పట్నాయక్ ముఖ్యవక్తగా పాల్గొన్నారు. భారతీయ గణిత శాస్త్రజ్ఞులు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రామానుజన్ అయ్యంగర్ అగ్రగణ్యులని సాత్మిక్ పట్నాయక్ అన్నారు. మ్యాథ్స్‌డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు ముఖ్యఅతిథి ఎ.రవికుమార్ బహుమతి ప్రదానం చేశారు. మోహన్ కుమార్ నాయక్, నర్మదా దెయి స్వాగత ఉపన్యాసం, అతిథి పరిచయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment