పాణి పంచాయతీ ప్రచార రథం ప్రారంభం
రాయగడ: జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో కలెక్టర్ ఫరూల్ పట్వారి ఆదివారం నాడు పాణి పంచాయతీ ప్రచార రథాన్ని ప్రారంభించారు. వాటర్ షెడ్ ప్రాజెక్టు డైరక్టర్ డాక్టర్ దయానిధి బాగ్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్ సంబంధిత శాఖ అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పట్వారి మాట్లాడుతూ పాణి పంచాయతీల ద్వారా రైతులు పొందాల్సిన అవసరాలకు సంబంధించి వారిని చైతన్య పరిచేందుకు ఈ రథాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. వారం రోజుల పాటుగా ఈ రథం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తిరిగి ప్రచారాన్ని కొనసాగిస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment