ముగిసిన ఇడితాల్ ఉత్సవాలు
● ప్రముఖులకు సన్మానం
రాయగడ:
జిల్లాలోని గుణుపూర్‌లో ఇడితాల్ పేరిట మూడు రోజులు జరిగిన చైతీ సమితి స్థాయి ఉత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో రాయగడ, గుణుపూర్, బిసంకటక్ ఎమ్మెల్యేలు అప్పలస్వామి కడ్రక, సత్యజీత్ గొమాంగో, నీలమాధవ హికక, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, గుణుపూర్ మున్సిపల్ చైర్మన్ మమత గౌతో తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ కిరణ్ దీప్ కౌర్ సహాట అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. సీనియర్ పాత్రికేయుడు దేవీ ప్రసాద్ చౌధరి, ప్రముఖ సమాజ సేవకులు, బాలనికేతన్ అనాథ ఆశ్రమ వ్యవస్థాపకులు బంఛానిధి మహాంతి సన్మానం పొందినవారిలో ఉన్నారు. ఉత్సవ కమిటీ కన్వీనర్ డాక్టర్ చంద్ర ధ్వజ పండ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.
Comments
Please login to add a commentAdd a comment