దుకాణంలోనికి దూసుకుపోయిన కారు
జయపురం: కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న టీ దుకాణంలోనికి దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. శునకం చనిపోయింది. ఈ సంఘటన బొయిపరిగుడ సమితి మఠపొడ గ్రామ పంచాయతీ టిపాగుడ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బరంపురం నుంచి ఏడుగురు వ్యక్తులు కారులో బోయిపరిగుడ సమితిలో ఉన్న ప్రసిద్ధ శివ క్షేత్రం గుప్తేశ్వర్ వెళ్లి తిరిగి వస్తుండగా అదుపుతప్పి టిపాగుడ గ్రామంలోని రోడ్డు పక్కన ఉన్న దుకాణంలోనికి దూసుకు పోయింది. దీంతో అక్కడ ఉన్న ఓ ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. అక్కడ ఉన్న శునకంపైకి కారు వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయింది. కారులో ఉన్న ముగ్గరు గాయపడ్డారు. గాయపడిన వారిలో టిపాకుడ గ్రామానికి చెందిన సురేంద్రకమడి, ధనపతి భైరాపుటియ, దొరాగుడ పంచాయతీ మఝిగుడ గ్రామానికి చెందిన ఉర్ధవ దొరాపుటియ ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్పించారు. వీరిలో సురేంద్రకమడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జయపురం ఫూల్‌బెడలో గల జిల్లా కేంద్ర ఆస్పహత్రికి రిఫర్ చేశారు. ప్రమాద స్థలాన్ని బొయిపరిగుడ, రామగిరి పోలీసులు సందర్శించారు. కారును సీజ్ చేసి డ్రైవర్ అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు.
ముగ్గురికి తీవ్రగాయాలు
శునకం మృతి
Comments
Please login to add a commentAdd a comment