ఆదర్శ గ్రామంలో కలెక్టర్ పర్యటన
రాయగడ:
రాయగడ జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి మునిగుడ సమితి పరిధిలోని శకట ఆదర్శ గ్రామంలో బుధవారం పర్యటించారు. బిర్షాముండ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 15 వ తేదీన ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ శకట గ్రామాన్ని సందర్శించి అక్కడ గల సమస్యలను పరిశీలించారు. గ్రామస్తుల సమస్యలను విన్నారు. అంగన్‌వాడీ, పాఠశాల పరిస్థితులపై ఆరా తీశారు. పుట్టగొడుగులు పంట కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామాభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. త్వరలోనే గ్రామానికి అవసరమైన మౌలిక సౌకర్యాలను మెరుగు పరిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment