ఆనందాల
గురువారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
జయపురం: క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. అవిభక్త కొరాపుట్‌లో అన్ని ప్రాంతాల్లోనూ చర్చిలు భక్తజనంతో పోటెత్తాయి. 143 ఏళ్ల చరిత్ర గలిగిన జయపురం జేఈఎల్‌సీ చర్చిలో వేలాది మంది ఆరాధకులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి వేడుకలకు హాజరై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవులతో పాటు ఇతర మతస్తులు పండగలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. బొరిగుమ్మ, కొట్‌పాడ్, బొరిగుమ్మ, కుంధ్ర, బొయిపరిగుడ తదితర ప్రాంతాల్లో క్రిస్మస్ పండగను ఘనంగా జరుపుకొన్నారు.
రాయగడలో..
క్రిస్మస్ వేడుకలు రాయగడ పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక అంబేడ్కర్‌నగర్‌లో మేరీ మాతను ప్రత్యేకంగా అలంకరించి ప్రార్థనలు నిర్వహించారు. కోయిర్ బృందం నృత్యాలు, ఆధ్యాత్మిక గీతాలపనలు, క్రైస్తవారాధనలు జరిగాయి. కార్యక్రమంలో చర్చి సంఘం సభ్యులు, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం ఉదయం నుంచి వర్షం పడుతున్నా పట్టణంలోని కళాశాల రోడ్డులోని సెంటినరీ బాప్టిస్టు చర్చికి అనేక మంది క్రిస్టియన్లు విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి పాదర్ డాక్టర్ ప్రదీప్‌కుమార్ యేసు సువార్తను చదివి వినిపించారు. క్రీస్తు జన్మించిన పశువుల పాకను ఆర్‌సీఎం చర్చిలో అందంగా అలంకరించారు. అలాగే డోలా ట్యాంకు రోడ్డులోని ఆర్‌సీఎం చర్చిలో పాదర్ అజిత్ కుమార్ నాయక్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దండుమాలవీధి వద్ద ఒడియా బాప్టిస్టు చర్చిలో యేసుప్రభువు పాటలు పాడి ప్రసంగాలు చేశారు. జిల్లాలో మోహానా, ఆర్.ఉదయగిరి, నువాగడ, కాశీనగర్‌లో శియ్యాలి, ఖండవ, గుమ్మాలో కోలాకోట్, అజయగడ, సెరంగో గ్రామాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
రాయగడ: ఏసు జన్మవృత్తాంతం తెలిపే ప్రదర్శన
న్యూస్‌రీల్
చర్చిల వద్ద అంబరాన్నంటిన సంబరాలు
నృత్యాలతో సందడి చేసిన యువత
క్రీస్తు సందేశం వినిపించిన పాస్టర్లు
Comments
Please login to add a commentAdd a comment