కలెక్టర్‌కు వినతుల వెల్లువ
మల్కన్‌గిరి: జిల్లాలోని పోడియా సమితి కార్యాలయం వద్ద సోమవారం కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. పరిసర గ్రామాల రైతులు పెద్ద ఎత్తున హాజరై సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. తాగునీరు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తదితర సమస్యలపై 37 వినతులు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, జిల్లా అదనపు ఎస్పీ తపన్ నారాయణ్ రోతో తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment