![అఖిలపక్ష సమావేశం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12ors4a-280030_mr-1739413410-0.jpg.webp?itok=9GiO5hNM)
అఖిలపక్ష సమావేశం
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో బడ్జెటు సమావేశాలు పురస్కరించుకుని అఖిల పక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి శాసన సభ స్పీకర్ సురమా పాఢి అధ్యక్షత వహించారు. బడ్జెటు సమావేశాలు సందర్భంగా సభలో సామరస్య వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో స్పీకరు అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. సభా కార్యకలాపాలను శాంతియుతంగా నిర్వహించడంలో సభ్యులు సహకరించాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, ప్రతిపక్ష చీఫ్ విప్ మరియు ఇతరులు హాజరయ్యారు. సభా కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూసేందుకు వివిధ రకాల ధృక్కోణాలను ఈ సమావేశంలో చర్చించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఈ నెల 17న సభలో ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు 28 రోజులు కొనసాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment