![ఆశా వర్కర్ల సేవలు వెలకట్టలేనివి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12ors33b-280025_mr-1739413411-0.jpg.webp?itok=dFAXTyKg)
ఆశా వర్కర్ల సేవలు వెలకట్టలేనివి
జయపురం: గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. బుధవారం జయపురం సమితి రామణగుడ కమ్యూనిటీ ఆస్పత్రి ప్రాంగణంలో ఉత్తమ ఆశావర్కర్లకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు ఉత్తమ సేవలందించిన బరిణిపుట్ ఆశావర్కర్ భవాణి పూజారి, కుడప ఆశావర్కర్ దేబపతి నాయిక్, ధనపూర్ ఆశావర్కర్ ప్రతిమ పంగి, హడియ ఆశావర్కర్ సుధాంశు బాల, పూజారిపుట్ ఆశా వర్కర్ గోమతి మహురియ, కొంగ ఆశావర్కర్ ఉషా హరిజన్, ఎకంబా పంచాయితీ ఆశావర్కర్ మమత మిశ్రాలకు సన్మానం చేసి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ స్వస్థిక్ మహల, డాక్టర్ అభిషేక్ కుంభార్, డాక్టర్ శౌమిత్ర దొలాయి, ప్రజారోగ్య విస్తరణ అధికారి ధరిత్రి ముదులి, డీపీఎం దీపాన్విత పట్నాయిక్, సూపర్‌వైజర్ సుశాంత నాయిక్, సమితి అకౌంటెంటెంట్ మేనేజర్ హిమాంశు మిశ్రా, జయపురం సమితి కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment