![మావోయ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12ors50-280073_mr-1739413412-0.jpg.webp?itok=ms0Cf8xz)
మావోయిస్టుల పేరిట నకిలీ లేఖలు
కొరాపుట్: మావోయిస్టుల పేరిట నకిలీ లేఖలు కలకలం సృష్టించాయి. బుధవారం కొరాపుట్ జిల్లా నారాయణపట్న సమితి తెంతులి పొదర్ గ్రామ పంచాయతీ కుముడసీల్, డొంగాపాయి గ్రామాల మధ్య వంతెన వద్ద ఇవి కనిపించాయి. సీపీఐ మావోయిస్టు పార్టీ పేరిట కొన్ని గోడ ప్రతులు, బ్యానర్లు ఉండటాన్ని గిరిజనులు గుర్తించారు. ఆ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య భూ విభేదాలపైనా హెచ్చరికలు చేశారు. అయితే ఈ లేఖల శైలి పరిశీలిస్తే మావోయిస్టు భావజాలం కనిపించకపోవడంతో నకిలీవిగా నారాయణ పట్న పోలీసులు చెబుతున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టుల ప్రభావం కొనసాగిన ఈ ప్రాంతంలో ఐదేళ్లుగా వారి జాడ లేదు.
![మావోయిస్టుల పేరిట నకిలీ లేఖలు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/13/12ors50a-280073_mr-1739413412-1.jpg)
మావోయిస్టుల పేరిట నకిలీ లేఖలు
Comments
Please login to add a commentAdd a comment