కొంగొత్త వెలుగులు తేవాలి
నరసరావుపేట: కోటి దీపాల దీపావళి ప్రజలందరి జీవితాల్లో కొంగొత్త వెలుగులు తేవాలని, అంతులేని ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం, సంపదలతో వర్ధిల్లాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆకాంక్షించారు. బుధవారం ఈ మేరకు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిని పారదోలి వెలుగులు నింపే పండుగగా, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దీపావళి పండగను జరుపుకుంటామని, ఈ దీపావళి అందరికీ విజయాలను కలుగ జేయాలని తెలిపారు. అందరి ఇంట్లో సిరులు పండాలని, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నానని తెలిపారు. పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలన్నారు.
మద్యం అక్రమ విక్రేతలు అరెస్ట్
క్రోసూరు: గుంటూరు జిల్లా ఎన్‌ఫోర్సుమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్సుమెంట్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, క్రోసూరు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ టి.తులసి, సిబ్బంది బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామంలో బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తెలంగాణకు చెందిన 64(41.6 లీటర్లు) బాటిళ్ల బీర్లు, 110 క్వార్టర్ (19.8 లీటర్ల) ఆంధ్ర మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులు బాణావత్ బద్రునాయక్, భూక్యా శివకృష్ణనాయక్ , రూపావత్ రాజానాయక్‌లను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్సుమెంట్ ఎస్‌ఐ ఎన్.శ్రీనివాసరావు, క్రోసూరు ఎకై ్సజ్ ఎస్‌ఐ శ్రీనివాసు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment