బెల్ట్ షాపులపై కఠిన చర్యలు
నరసరావుపేట టౌన్: బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు చెప్పారు. ఎకై ్సజ్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా బెల్ట్ షాపులు నిర్వహించకూడదని, పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసిన దుకాణం లైసైన్స్‌ను కూడా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకే విక్రయించాలని ఆదేశించారు. దుకాణాల్లో సీసీ కెమెరాలతో పాటు ధరల పట్టికను ప్రదర్శించాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకువచ్చి విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్టు వెల్లడించారు. జిల్లాలో 11 ప్రాంతాల్లో నాటుసారా తయారీ కేంద్రాల్ని గుర్తించామని పేర్కొన్నారు. నాటుసారా తయారీదారులతో పాటు, ఇతర రాష్ట్రాల మద్యాన్ని అక్రమంగా తీసుకువచ్చే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ పెడతామని ఎస్పీ స్పష్టంచేశారు. ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై మంగళవారం నుంచి దాడులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేక బృందాలు దాడులు జరిపి కేసులు నమోదు చేస్తున్నాయని వెల్లడించారు. రెండు రోజుల్లో 14 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. సమావేశంలో ఈఎస్ మణికంఠ, ఏఈఎస్ రవీంద్ర, సీఐ సోమయ్య పాల్గొన్నారు.
ఎకై ్సజ్ డీసీ శ్రీనివాసరావు
ఎమ్మార్పీకే మద్యాన్ని విక్రయించాలి
Comments
Please login to add a commentAdd a comment