కళ తగ్గిన రిటైల్ వ్యాపారం
నరసరావుపేట: ఈ ఏడాది బాణసంచా రిటైల్ వ్యాపారులు వెనుకంజ వేశారు. గతేడాది షాపులను ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపించిన వ్యాపారులు ఈసారి పెద్దగా ఆసక్తి చూపలేదు. హోల్‌సేల్ దుకాణాలు పెరగడం, వాతావరణం అనుకూలించకపోవడంతో షాపుల్ని తగ్గించుకున్నారు. ప్రతి ఏడాది సత్తెనపల్లి రోడ్డులోని డీఎస్‌ఎ స్టేడియంలో షాపులు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది 47 షాపులను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కేవలం 26తోనే సరిపెట్టారు. షాపుల ఏర్పాటుకు మున్సిపల్, అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫీజులు చెల్లించి ముందస్తుగా వ్యాపారులు అనుమతి తీసుకున్నారు. ప్రభుత్వం వీరికి కేవలం ఒకరోజుకే షాపులు పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చింది. బుధవారం మున్సిపల్ సిబ్బంది స్టేడియంలో షాపులు ఏర్పాటు చేసేందుకు మార్కింగ్ ఇవ్వడంతో వ్యాపారులు తాత్కాలిక టెంట్లలో సరుకు పెట్టి సర్దుకున్నారు.
హోల్‌సేల్ దెబ్బ
బుధవారం సాయంత్రం నుంచి పండగ రోజు సాయంత్రం వరకు ముమ్మరంగా వ్యాపారం జరగాల్సివుంది. అయితే, పట్టణంలో ఏడుగురు హోల్‌సేల్ వ్యాపారులు కూడా బాణసంచాను విక్రయిస్తున్నారు. దీన్ని రిటైల్ వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. హోల్‌సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారం కూడా చేస్తూ రోజుకు రూ.30లక్షల మేరకు సరుకు విక్రయిస్తున్నారని వాపోతున్నారు. దీని వల్ల తమ దగ్గరకు కొనుగోలుదారులు రాక నష్టం వస్తోందని రిటైల్ వ్యాపారులు వాపోతున్నారు. గతేడాది షాపులు పెట్టిన వారందరికీ నష్టాలు రావడంతోనే ఈ ఏడాది ముందుకురాలేదని చెబుతున్నారు. కాగా, గతేడాది కంటే ఈసారి పది శాతం వరకు ధరలు పెరిగాయని రిటైల్ వ్యాపారులు పేర్కొన్నారు.
భద్రతా మార్గదర్శకాలు పాటించాలి
షాపుల ఏర్పాటును ఆర్డీవో కె.మధులత, తహసీల్దార్ వేణుగోపాలరావు బుధవారం పరిశీలించారు. నిబంధనలు పాటించాలని వ్యాపారులకు సూచించారు. పట్టణ పోలీసు సీఐలు చరణ్, హైమారావుకు పలు సూచనలు చేశారు. పటాసుల నిల్వ, విక్రయాల్లో భద్రత, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని చెప్పారు.
గత ఏడాది కంటే తగ్గిన 20 షాపులు
హోల్‌సేల్ వ్యాపారంతో
నష్టాలే అంటున్న వ్యాపారులు
షాపుల ఏర్పాటుకు వెనుకంజ
Comments
Please login to add a commentAdd a comment